నూతన దంపతుల మధ్య వచ్చిన గొడవల్లో తలదూర్చిన సోదరుడు ఏకంగా తన బావనే హత్యచేసిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. హత్య అనంతరం బావ చెయ్యి నరికిన బావమరిది.. దానిని సంచిలో పెట్టుకుని పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లాడు.
ఇదీ జరిగింది..
ఉదయగిరికి చెందిన కదీర్ మహమ్మద్ అనే వ్యక్తి సోదరికి సరన్ అనే యువకునితో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. గౌసియా నగర్లో నివాసముంటున్న ఈ నూతన దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. అవి కాస్తా పెద్దతగాదాగా మారి వారి మధ్య దూరం పెరిగింది.
ఈ గొడవలను పరిష్కరించి.. తమ కూతురి కాపురం సరిదిద్దేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పలు గొడవలు జరుగుతున్నాయి. వీటితో ఆగ్రహానికి గురైన కదీర్.. తన బావ మహమ్మద్ సరన్ను నరికేశాడు. తీవ్ర రక్తస్రావంతో సరన్ అక్కడిక్కడే మరణించాడు.
సంచిలో బావ చెయ్యితో పోలీసు స్టేషన్లో లొంగిపోయిన కదీర్ మహమ్మద్ అంతటితో ఆగని కదీర్.. తన బావ చేతిని వేరుచేసి సంచిలో పెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన ఉదయగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి: