ఇంట్లో నెమళ్లు పెంచుతున్న ఓ వ్యక్తిని అటవీ శాఖ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక.. మైసూర్ జిల్లా కామెగౌడనహళ్లిలో జరిగింది. నిందితుడిని మంజు నాయక్‌గా గుర్తించారు. మొబైల్ విజిలెన్స్ స్క్వాడ్ ఆధ్వర్యంలో మంజు నాయక్ ఇంటిపై దాడులు జరపగా.. అతడు అనేక నెమళ్లను పెంచుతున్నట్లు తేలింది.
నిందితుడి ఇంట్లో దాడి జరిపి ఓ పెద్ద నెమలిని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద మంజు నాయక్‌పై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. 1972లో నెమలికి జాతీయ పక్షిగా గుర్తింపు లభించింది. హిందువులు నెమలిని పవిత్రంగా పూజిస్తుంటారు. అయితే, నెమలి పింఛం, మాంసం కోసం వీటిని దుండగులు వేటాడుతున్నారు.