తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తొలి ఫ్లైట్​ టెస్టింగ్ ఇంజినీర్​గా 'ఆష్రిత' రికార్డు - కర్ణాటక వార్తలు ఆన్​లైన్

మహిళలు ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ తమదైన ముద్రవేస్తూ దూసుకుపోతున్నారు. కర్ణాటకకు చెందిన ఆష్రితా ఓలేటి.. వైమానిక దళంలో అత్యంత కఠినమైనదిగా భావించే.. 'ఫ్లైట్​ టెస్టింగ్ ఇంజినీర్'గా ఎంపికై రికార్డు సృష్టించారు.

Ashraita Oletti
తొలి ఫ్లైట్​ టెస్టింగ్ ఇంజినీర్​గా ఆష్రిత రికార్డు!

By

Published : May 23, 2021, 5:28 AM IST

అవకాశాలు రావాలేగాని మగవారితో సమానంగా మహిళలు రాణించగలరని అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా కర్ణాటక చామరాజనగర్​ జిల్లా కొల్లెగళకు చెందిన ఆష్రితా ఓలేటి ఫ్లైట్​ టెస్టింగ్ ఇంజినీర్​గా ఎంపికయ్యారు. వైమానిక దళంలో కఠినంగా భావించే ఈ పోస్టుకు ఎంపికైన తొలి మహిళగా నిలిచారు.

ఆష్రితా ఓలేటి

భారత్​లోని ఎయిర్​ఫోర్స్ టెస్ట్ పైలట్​ స్కూల్​ నుంచి ఆమె ఎంపికయ్యారు. ఈ శిక్షణ భారత్​లో ప్రారంభమైన(1976లో) నాటి నుంచి.. 275 మంది మాత్రమే ఈ కోర్సు పూర్తి చేశారు.

అత్యంత కఠినమైన శిక్షణా కోర్సును ఆష్రితా ఓలేటి విజయవంతంగా పూర్తి చేసి.. భారత వైమానిక దళంలో క్వాడ్రిల్ నాయకురాలిగా చేరారు. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్లు విమానయాన వ్యవస్థను అంచనా వేస్తుంటారు.

భారత్​లోని ఎయిర్​ఫోర్స్ టెస్ట్ పైలట్​ స్కూల్ ప్రపంచంలోని ఏడు యూనివర్సిటీల్లో ఒకటని రిటైర్డ్ సైనికాధికారి గంగాధర్​ తెలిపారు.

ఇవీ చదవండి:ఒకేసారి 2 చేతులతో రాసి.. ప్రపంచ రికార్డు కొల్లగొట్టి..

పదేళ్ల చిన్నారి ప్రతిభకు ప్రపంచ రికార్డు దాసోహం

ABOUT THE AUTHOR

...view details