ఆడుతూ పాడుతూ, చదువుకోవాల్సిన వయసులో ఆ బాలికకు పెళ్లి చేశారు. అత్తారింటికి పంపించారు. భర్త వద్ద బందీగా మార్చారు. ఎలాగైనా సరే ఆ చెర నుంచి తప్పించుకోవాలనుకున్న ఆమె.. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టింది. కానీ, ఎటు వెళ్లాలో తెలియక నడిరోడ్డులో నిల్చుండిపోయింది. ఈ సంఘటన కర్ణాటక కోలార్ జిల్లా హలేపాల్యా గ్రామంలో జరిగింది.
వారం క్రితమే..
సదరు బాలికకు ఓ వ్యక్తితో వారం క్రితమే పెళ్లి జరిపించారు ఆమె తల్లిదండ్రులు. ఈ వివాహం ఏ మాత్రం నచ్చని ఆ బాలిక.. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. జాతీయ రహదారి 75పై నంగోలీ వద్ద ఒంటరిగా నిల్చున్న ఆ బాలికను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సందేశ్‌కు తెలియజేశారు.