తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పక్షుల కోసం ప్రభుత్వ చలివేంద్రాలు!

ఎండాకాలంలో నీటి కోసం పక్షుల పడే బాధను చూడలేక కర్ణాటకలోని కలబురిగి నగర పాలక సంస్థ వినూత్న ప్రయత్నం చేసింది. గార్డెన్​లలో పిట్టల కోసం ప్రత్యేక చలివేంద్రాలు ఏర్పాటు చేసింది.

watering facilities in the gardens for the birds
పక్షుల కోసం.. చలివేంద్రాలు

By

Published : Mar 30, 2021, 10:42 AM IST

ఎండలు మండి పోతున్నాయి. మనుషులే కాదు, పశుపక్ష్యాదులూ దాహంతో విలవిల్లాడుతున్నాయి. మనుషులైతే ఎలాగైనా నీటిని తెచ్చుకుంటారు. మూగజీవాలు అలాకాదు కదా. అందుకే పక్షుల కోసం గార్డెన్లలో నీళ్ల సదుపాయం కల్పించి మానవత్వాన్ని చాటుకుంటోంది కర్ణాటకలోని కలబురిగి నగర పాలక సంస్థ

పక్షుల కోసం.. చలివేంద్రాలు
పక్షుల కోసం.. చలివేంద్రాలు
స్నేహాల్​ లోకండే, కలబురిగి నగర కార్పొరేషన్​ కమిషనర్​

"ఎండలు పెరగడం వల్ల నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. పక్షుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాటికి నీరు దొరకడం కష్టమైంది. అందుకే గార్డెన్లలోకి తరచూ వచ్చే పక్షుల కోసం నీటి కేంద్రాల్ని ఏర్పాటు చేశాం."

-స్నేహాల్​ లోకండే, కలబురిగి నగర కార్పొరేషన్​ కమిషనర్​

ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్​, బస్టాండ్​లలో చలివేంద్రాల్ని ఏర్పాటు చేశామని కలబురిగి నగర కార్పొరేషన్​ కమిషనర్​ తెలిపారు.

ఇదీ చదవండి:గుర్రాల ఆకలి తీర్చుతున్న బాలిక

ABOUT THE AUTHOR

...view details