Karnataka crime news: భార్యతో గొడవపడి ఆమెను హత్య చేశాడు ఓ వ్యక్తి. ఆమె నిద్రిస్తుండగా.. తెల్లవారుజామున 3 గంటలకు కత్తితో పొడిచి చంపేశాడు. తెల్లవారే వరకు ఆమె మృతదేహం పక్కనే పడుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది.
మట్టికేరె ప్రాంతంలో థానేంద్ర- అనసూయ దంపతులు నివసిస్తున్నారు. గతంలో రూ.1.20 లక్షల అప్పు తీసుకున్నాడు థానేంద్ర. అయితే, రుణం చెల్లించే విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ కోపంతోనే థానేంద్ర.. తన భార్యను వదిలించుకోవాలని అనుకున్నాడు. అనసూయ పడుకున్న సమయంలో కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సమయంలో పదమూడేళ్ల అతడి కూతురు పక్కనే ఉంది. నిద్రలో ఉన్న చిన్నారి.. హత్యను గమనించలేదు. సూర్యోదయం వరకు నిందితుడు తన భార్య శవం పక్కనే నిద్రించాడు. ఉదయం లేచి తన తల్లిని చూసిన చిన్నారి.. గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది.