Karnataka High Court Hijab: భారత రాజ్యాంగానిది సునిశిత లౌకికవాదమని, టర్కీ మాదిరిగా నెగెటివ్ సెక్యులరిజం కాదని సీనియర్ అడ్వొకేట్ దేవదత్ కామత్ పేర్కొన్నారు. కర్ణాటకతో పాటు దేశాన్ని కుదిపేసిన హిజాబ్ అంశంపై హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఆయన వాదనలు వినిపించారు. దక్షిణ భారతదేశానికి చెందిన హిందూ బాలిక ముక్కుపుడుక ధరించే పాఠశాలలకు వస్తుందని అన్నారు. ఈ కేసు యూనిఫాంకు సంబంధించినది కాదని, యూనిఫాం ధరించడానికి మినహాయింపులకు సంబంధించిందని కోర్టుకు విన్నవించారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా న్యాయస్థానం వెలువరించిన తీర్పును ప్రస్తావించారు.
karnataka hijab row high court
"కొంత మంది విద్యార్థులు మతాచారాలను పాటించడం వల్ల స్కూళ్లలో ఉండే ఇతర పిల్లలు తమ సంస్కృతిని పాటించేలా ప్రోత్సహించినట్లు అవుతుంది. దీని వల్ల భయపడాల్సిన అవసరం లేదు. బహిరంగ ప్రదేశాల్లో మతాచారాలను ప్రదర్శించడం ఆందోళకరమైన విషయం కాదు. దీని వల్ల దేశ వైవిధ్యాన్ని చాటి చెప్పినట్లు అవుతుంది. మన రాజ్యాంగం సునిశితమైన లౌకికవాదాన్ని పాటిస్తుంది. టర్కీ లౌకికవాదం మాదిరిగా కాదు. టర్కీలో నెగెటివ్ లౌకికవాదం ఉంది. మన లౌకికవాదం ప్రతి ఒక్కరి మతపరమైన హక్కులు కాపాడుతుంది."