తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిజాబ్, కాషాయ దుస్తులు ధరించొద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Karnataka High Court Hijab: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా విద్యార్థులు ఎవరూ మతపరమైన దుస్తులు(హిజాబ్, కాషాయ కండువాలు) ధరించొద్దని ఆదేశించింది. శుక్రవారమే విద్యా సంస్థలను తెరవాలని స్పష్టం చేసింది.

Karnataka High Court Hijab
Karnataka High Court Hijab

By

Published : Feb 10, 2022, 5:24 PM IST

Karnataka High Court Hijab: హిజాబ్ వివాదం ముదిరి చెలరేగిన ఘర్షణల కారణంగా మూతబడిన పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారమే విద్యా సంస్థలను తెరవాలని స్పష్టం చేసింది. అందరూ యథాతథ స్థితిని పాటించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

సమస్య పరిష్కారమయ్యేంత వరకు విద్యార్థులు ఎవరూ మతపరమైన దుస్తులను ధరించకూడదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజలను ప్రేరేపించే హిజాబ్ కానీ, కాషాయ కండువాలను కానీ ధరించొద్దని తెలిపింది.

Hijab issue Karnataka HC:

ఈ సందర్భంగా విద్యాసంస్థల్లో ధరించే దుస్తులపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మౌఖికంగా చేసిన ఈ వ్యాఖ్యలను ప్రసారం చెయ్యొద్దని వార్తా సంస్థలకు స్పష్టం చేసింది. తుది ఆదేశాలు వచ్చేంత వరకు సంయమనంతో ఉండాలని సూచించింది. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:'హిజాబ్'​ వివాదం కేసు బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ

ABOUT THE AUTHOR

...view details