ట్విట్టర్ ఎండీ మనీశ్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యూపీ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. పోలీసుల దర్యాప్తుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరటంపై స్పందించిన కోర్టు.. వర్చువల్గా విచారించవచ్చని సూచించింది. యూపీ పోలీసుల నోటీసులపై కర్ణాటక హైకోర్టును మనీశ్ మహేశ్వరి ఆశ్రయించారు.
ట్విట్టర్ ఎండీకి హైకోర్టులో ఊరట - case on Twitter MD
ట్విట్టర్ ఎండీ మనీశ్ మహేశ్వరిపై యూపీ పోలీసులు చర్యలు తీసుకోవద్దని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యూపీ పోలీసుల నోటీసులపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు మనీశ్ మహేశ్వరి.
![ట్విట్టర్ ఎండీకి హైకోర్టులో ఊరట Twitter MD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12249593-531-12249593-1624537630445.jpg)
ట్విట్టర్ ఎండీ
వ్యక్తిపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణతో యూపీ ఘజియాబాద్ పోలీసులు మహేశ్వరికి నోటీసులు జారీ చేశారు. నేరంతో తనకు సంబంధం లేదని తెలిపిన ట్విట్టర్ ఎండీ మనీశ్ మహేశ్వరి.. తాను బెంగళూరులో నివసిస్తున్నానని తెలిపారు.
ఇదీ చదవండి:West Bengal: మమత 'నందిగ్రామ్' పిటిషన్పై తీర్పు వాయిదా
Last Updated : Jun 24, 2021, 6:09 PM IST