తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హెల్మెట్‌ తెచ్చిన తంటా.. మారిపోయిన భార్యాభర్తలు.. ఆ తర్వాత.. - కర్ణాటకలో మారిపోయిన భార్యాభర్తలు న్యూస్

తన భార్య అనుకుని వేరే వాళ్ల ఆవిడను బైక్​పై ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు ఓ వ్యక్తి. అతడు వెళ్తున్న దారిని చూసి అనుమానంతో 'ఏవండీ ఇటుకాదు కదా మన ఇల్లు' అని అడిగేసరికి ఆమె తన భార్య కాదన్న సంగతి తెలుసుకున్నాడు. అసలేం జరిగిందంటే?

karnataka helmet incident Changed husband and wife
హెల్మెట్‌ తెచ్చిన తంట

By

Published : Feb 10, 2023, 8:56 AM IST

'ఏమండీ.. మన ఇల్లు ఇటుకాదు కదా.. ఇటు వైపు ఎందుకు తీసుకువెళుతున్నారు?' అని ఆ మహా ఇల్లాలు తన భర్తను ప్రశ్నించింది. ఏంటీ భార్య అలా మాట్లాడుతోందని వెనక్కు తిరిగి చూస్తే- తన ద్విచక్ర వాహనంపై కూర్చున్నావిడ తన భార్య కాదని తెలుసుకుని, నాలుక కరచుకున్నాడాయన. భార్యతో కలిసి పెట్రోలు పోయించుకునేందుకు వెళ్లిన వ్యక్తికి- అక్కడే నిలబడి ఉన్న మహిళను బండి ఎక్కమన్నాడు. పిలిచింది తన భర్తే అని ఆమె అనుకుంది. తన భార్య ధరించిన రంగు చీరే కట్టుకుని ఉండడంతో బైకు ఎక్కినావిడి తన భార్యే అని ఈయన అనుకున్నారు.

భర్త లాంటి బైకు.. అదే సౌష్ఠవం.. తెల్ల చొక్కా.. ఒకే రంగు శిరస్త్రాణం ఉండడంతో ఈమె కూడా పొరపాటు పడింది. జరిగిన పొరపాటు అర్థమైన ఐదు నిమిషాలలోనే ఆయన తిరిగి ఆమెను పెట్రోలు బంకు దగ్గరకు తీసుకు వచ్చాడు. అప్పటికే ఈయన భార్య, ఆమె భర్త అక్కడ వేచి చూస్తూ ఉన్నారు. నలుగురూ మొహం కప్పి ఉంచే శిరస్త్రాణాలు ధరించి ఉండడంతో ఈ పొరపాటు జరిగిందని తెలుసుకుని వారితో పాటు, బంకులో ఉన్న వారూ ఆ విషయం తెలుసుకుని కడుపుబ్బా నవ్వుకున్నారు. కర్ణాటక హావేరి జిల్లా రాణేబెన్నూరులో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details