తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ అమలు - karnataka cm

కరోనా వ్యాప్తి కట్టడికి రాత్రి​ కర్ఫ్యూ విధించిన మహారాష్ట్ర బాటలోనే పయనించింది కర్ణాటక. జనవరి 2 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని కర్ణాటక సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు.

Karnataka government imposes night curfew (between 10 pm & 6 am) in the state
కర్ణాటకాలో మళ్లీ ఆంక్షలు

By

Published : Dec 23, 2020, 1:17 PM IST

Updated : Dec 23, 2020, 2:06 PM IST

వేర్వేరు దేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు విధించింది. ఈ రోజు నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రకటించింది.

"కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్ వ్యాప్తిని పరిగణించి.. కేంద్రం, సాంకేతిక సలహా కమిటీ సూచన మేరకు ఈ రోజు నుంచి రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించాము. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు సాగే ఈ కర్ఫ్యూ జనవరి 2 వరకు ఉంటుంది. ప్రజలు ఇందుకు సహకరించి ఈ వైరస్​ వ్యాప్తిని నివారించాలి."

-బీఎస్ యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి

72 గంటల్లోపే...

విదేశాలను నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కొవిడ్ సర్టిఫికెట్​ తీసుకురావాలని, ప్రయాణానికి 72 గంటల ముందు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. విమానాశ్రయం వద్ద అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆంక్షలపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు యధావిధిగా కార్యకలాపాలు జరుగుతాయని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు విధించమని చెప్పిన కొన్ని గంటలే ఈ నిబంధనలను అమలు చేయడం గమనార్హం.

ఇదీ చూడండి :'మోదీ జీ... మనకు టీకా వచ్చేది ఎప్పుడు?'

Last Updated : Dec 23, 2020, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details