16ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేసిన దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న బాలికను కారులో వచ్చిన కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా.. అత్యాచారం అనంతరం ఆ బాలికను బ్రహ్మరకూట్ల అనే ప్రాంతంలో వదిలివెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వివరించారు పోలీసులు.
బాధితురాలి సమాచారం మేరకు కొన్ని ఆధారాలు సేకరించినట్లు వెల్లడించిన పోలీసులు.. బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లతో పాటు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మైనర్పై రెండేళ్లుగా..
14ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న 58 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. ఝార్ఖండ్ సిమ్‌దేగా జిల్లాలో ఓ గ్రామంలో గత రెండేళ్లుగా జరుగుతున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బాలిక తండ్రి కేరళలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి కూలీపనికి వెళుతుంది. దీనిని అదునుగా భావించిన పొరుగింటి వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవలే దీని గురించి తనకు తెలిసిందని బాలిక తల్లి పోలీసులకు వివరించింది. అయితే ఈ వ్యవహారం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు తనను బెదిరించేవాడని బాలిక వాపోయింది.
ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: