తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జీపు కింద మృత్యువుతో తండ్రి పోరాటం.. కాపాడేందుకు ఆ బాలిక చేసిన పనికి సీఎం ఫిదా.. ప్రత్యేక అవార్డుతో...

కర్ణాటకలో ఓ బాలిక చేసిన సాహసానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఈ సంవత్సరం బాలల దినోత్సవం సందర్భంగా "కేళడి చెన్నమ్మ శౌర్య" అనే అవార్డును బహూకరించింది. ఇంతకీ ఏం చేసిందంటే..

class 7 girl saving her father in a accident
రెండు కిలోమీటర్లు పరుగెత్తుకెళ్లి తండ్రి ప్రాణాలను కాపాడుకున్న బాలిక, తన తండ్రి

By

Published : Nov 14, 2022, 4:39 PM IST

తండ్రిని కాపాడుకునేందుకు సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఓ బాలికను కర్ణాటక ప్రభుత్వం సత్కరించింది. బాలల దినోత్సవం సందర్భంగా ఆమెకు "కేళడి చెన్నమ్మ శౌర్య" అనే అవార్డును ఇచ్చింది. ఆమె పేరు కౌసల్యా వెంకట రమణహెగ్డే. ఆమె సిద్దాపుర్ మండలం కనాసూర్​ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆమె రెండు కిలోమీటర్లు పరుగెత్తుకెళ్లి తన తండ్రి ప్రాణాలను కాపాడింది. ఆమె ధైర్యసాహసానికి మెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బాలల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ఇచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. 2021 మార్చి 18న సమీప గ్రామంలో ఓ కార్యక్రమానికి తన తండ్రి, తమ్ముడితో కలిసి జీపులో వెళ్లింది కౌసల్య. ఆ సమయంలో ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న జీపు బోల్తా కొట్టింది. ఆమెతో పాటు 5 సంవత్సరాల వయసున్న తమ్ముడు జీపులో ఉండిపోయాడు. ఆమె తండ్రి మాత్రం జీపు కింద ఇరుక్కుపోయాడు. దీంతో తన తండ్రిని జీపు కింద నుంచి పైకి లాగటానికి తన శాయశక్తులా ప్రయత్నించింది. ఎంత శ్రమించినా ఆమె తన తండ్రిని పైకి లాగలేకపోయింది.

తండ్రిని రక్షించేందుకు చుట్టుపక్కల వారి సహాయం తీసుకుందామని ప్రయత్నించింది కౌసల్య. సమీపంలో ఎవరూ లేకపోవటం వల్ల రెండు కిలోమీటర్ల దూరం పరుగెత్తింది. జరిగిన ప్రమాదం గురించి చెప్పి తమకు సాయం చేయమంటూ కొందరిని ప్రమాదం జరిగిన స్థలానికి తీసుకుని వచ్చింది. చివరకు వారి సహాయంతో ఆమె తన తండ్రిని కాపాడుకోగలిగింది. ఇంత చిన్న వయసులో ఆమె కనబరిచిన సమయస్ఫూర్తి, సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆమెకు "కేళడి చెన్నమ్మ శౌర్య" అనే అవార్డును ఇచ్చింది. ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును ధైర్యసాహసాలు కనబరిచిన పిల్లలకు ఇస్తారు.

ఇవీ చదవండి:ముక్కు లేని వింత శిశువు జననం.. దేవుడు, గ్రహాంతరవాసి అంటూ పుకార్లు

వైవాహిక బంధాలను కాపాడుతున్న జడ్జి.. రాజీ కుదర్చడంలో జాతీయ రికార్డు!

ABOUT THE AUTHOR

...view details