తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సినిమాల్లోకి యడియూరప్ప- సీఎం పాత్రలోనే... - Yeddyurappa enters Film industry

Yeddyurappa Movies: కర్ణాటక మాజీ సీఎం బీఎస్​ యడియూరప్ప మరోసారి సీఎం కానున్నారు. అయితే రియల్​ లైఫ్​లో కాదు.. రీల్​ లైఫ్​లో. అవును. యడియూరప్ప సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఓ వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. ఆ సినిమా కథేంటంటే..?

Yeddyurappa Movies
Yeddyurappa Movies

By

Published : Feb 20, 2022, 3:42 PM IST

Updated : Feb 20, 2022, 6:13 PM IST

సినిమాల్లోకి యడియూరప్ప- సీఎం పాత్రలోనే...

Yeddyurappa Movies: సినిమాల్లో నటించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి.. సుపరిపాలన అందించి ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అయితే రాజకీయ నేతలు.. నటులుగా మరాడం అరుదనే చెప్పొచ్చు! ఇప్పుడు ఆ జాబితాలో చేరారు కర్ణాటక మాజీ సీఎం, భాజపా నేత బీఎస్​ యడియూరప్ప. ఓ చిత్రంలో సీఎం పాత్రలో కనిపించనున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న ఆ సినిమాకు.. 'తనుజ'గా పేరు ఫిక్స్​ చేసింది చిత్రబృందం.

కర్ణాటక మాజీ సీఎం బీఎస్​ యడియూరప్ప
యడియూరప్పకు సీన్​ వివరిస్తున్న దర్శకుడు

కథేంటంటే..?

యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో కొవిడ్ కారణంగా నీట్ పరీక్ష హాజరయ్యేందుకు తనుజ అనే విద్యార్థిని ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో పాత్రికేయులు విశ్వేశ్వర భట్​, ప్రదీప్​ ఈశ్వర్​..​ తనుజ నీట్​ పరీక్షకు హాజరయ్యేందుకు సహాయం చేశారు. ఆ పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. ఆ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ఆధారంగానే.. సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సినిమా షూటింగ్​లో యడియూరప్ప
చిత్రబృందంతో యడియూరప్ప

'బియాండ్‌ విజన్స్‌ సినిమాస్‌' బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. హరీశ్​ ఎండీ హళ్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బీఎస్​ యడియూరప్ప, జర్నలిస్ట్ విశ్వేశ్వర భట్, డాక్టర్​ సుధాకర్, నటి తారా అనురాధ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

ఇదీ చూడండి:సోనూసూద్​కు షాక్.. కారు సీజ్.. బయటకు రావద్దని ఈసీ వార్నింగ్

Last Updated : Feb 20, 2022, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details