Dead Body Preservation: మనిషి చనిపోయి కొన్ని గంటలు గడిచేసరికే ఆ శవం కుళ్లిపోవడం మొదలవుతుంటుంది. ఆ శవం నుంచి భరించలేని దుర్గంధం కూడా వస్తుంటుంది. శీతల వాతావరణంలో మాత్రమే వీటిని భద్రపరచగలరు. కానీ ఈ మృతదేహాలు సాధారణ ఉష్ణోగ్రతల్లో కూడా వందల ఏళ్లు గడిచినా పాడవకుండా ఉండేలా ఓ ఫోరెన్సిక్ వైద్యుడు ప్రయోగం చేశారు. ఇందులో భాగంగా ఆయన ప్రయోగం జరిపిన నాలుగు మృతదేహాలను కర్ణాటక బెంగళూరులోని ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థుల ముందు శుక్రవారం ప్రదర్శించారు.
శవాలను కూర్చోబెట్టి స్టూడెంట్స్‌కు క్లాస్- డాక్టర్ ప్రయోగం సక్సెస్! - మృతదేహాలు భద్రపరచడం
Dead Body Preservation: సాధారణ ఉష్ణోగ్రతల్లోనే వందల ఏళ్ల పాటు మృతదేహాలను భద్రపరుచుకునేందుకు వీలుగా ప్రయోగం చేశారు ఓ ఫోరెన్సిక్ వైద్యుడు. కర్ణాటక బెంగళూరులోని ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజీలో ఆయన ప్రయోగం జరిపిన నాలుగు మృతదేహాలను ప్రదర్శనకు ఉంచారు.
ప్రదర్శనకు ఉంచిన నాలుగు మృతదేహాల్లో మూడు పెద్దలవి కాగా ఒకటి శిశువుది. "ఈ మృతదేహాలను నేను గత కొంతకాలంగా సాధారణ ఉష్ణోగ్రతల్లోనే భద్రపరుస్తున్నాను. ఇవి ఏ రకంగానూ పాడవలేదు. ఎలాంటి దుర్వాసన కూడా లేదు. నేను వాడిన రసాయనాలు, ఉపయోగించిన విధానం వాసన రాకుండా కట్టడి చేసింది. రసాయనాలు బాగా పనిచేశాయి." అని డాక్టర్ దినేశ్ రావు వెల్లడించారు. డాక్టర్ దినేశ్.. అదే కాలేజీలో ఫోరెన్సిక్ సైన్స్ స్పెషలిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు.
ఇదీ చూడండి :రూ.180 చెప్పులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు.. నవ్వుకున్న పోలీసులే చివరకు...