ప్రభుత్వ కార్యక్రమాలలో దండలు, శాలువాలు, పూల బొకేలు, జ్ఞాపికలు ఇవ్వడమనేది అనవసరమైన ఖర్చు అని కర్ణాటక నూతన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అభిప్రాయపడ్డారు. వీటికి బదులు పుస్తకాలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఓ ఉత్తర్వును జారీ చేసింది. దండలు, బొకేలు ఇవ్వడాన్ని నిషేధించింది.
ఆ సమావేశం నుంచే..
బెంగళూరులో సీనియర్ పోలీసు అధికారుల సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి బొమ్మై పూల బొకేను స్వీకరించేందుకు నిరాకరించారు. అంతేగాక వాటిని అనవసర ఖర్చుగా పేర్కొన్నారు.
"ప్రోటోకాల్ పేరుతో దండలు, శాలువలు, పుష్పగుచ్ఛాలు, పండ్ల బుట్టలు ఇచ్చే ఆచారాన్ని విరమించుకోండి. ఇదంతా వృథా ఖర్చు."