డిజిటల్ మీడియాలో విప్లవం సృష్టిస్తున్న 'ఈటీవీ భారత్'కు మంచి భవిష్యత్తు ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు(bommai latest news). దేశంలోని అన్ని భాషల్లోనూ ఈటీవీ భారత్ అందుబాటులో ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు.
బెంగళూరులోని 'ఈటీవీ భారత్' కార్యాలయాన్ని సందర్శించారు ముఖ్యమంత్రి బొమ్మై. డిజిటల్ మీడియాకు సంబంధించిన అనేక విషయాలను ఆయనకు వివరించారు అక్కడి సిబ్బంది(etv bharat kannada).
"డిజిటల్ మీడియాకు మంచి భవిష్యత్తు ఉంది. సామాన్యులు.. మొబైల్ ద్వారా డిజిటల్ మీడియాను సులభంగా యాక్సెస్ చేయగలరు. వివిధ భాషల్లో యాప్ను తీసుకురావడం చాలా మంచి విషయం. రామోజీ రావు దూరదృష్టి కలిగిన వ్యక్తి. దేశంలోని మీడియా వ్యవస్థలో ఆయన అనేక మార్పులు తీసుకొచ్చారు. ఆయన నేతృత్వంలోని ఈటీవీ భారత్.. అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉండటం సంతోషంగా ఉంది."