ముఖ్యమంత్రి పక్కన కూర్చుని ఓ స్వామీజీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర అసహనానికి గురైన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.. ఆ స్వామీజీ చేతుల్లో నుంచి మైకు లాక్కుని విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కర్ణాటకలోని మహదేవపురలో ఓ బహిరంగ కార్యక్రమంలో జరిగిందీ ఘటన. ఈ కార్యక్రమంలో కాగినేలె మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరనందపురి స్వామీజీ పాల్గొన్నారు. బెంగళూరులో సరైన మౌలికసదుపాయాలు లేక నగరవాసులు పడుతున్న అవస్థలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు ఈశ్వరనందపురి స్వామీజీ. అలాగే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
"బెంగళూరులో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇక్కడకు వస్తున్నారు. ఇవన్నీ మేం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు ఇబ్బందులకు గురవకుండా ఏం చేయాలో అధికారులకు తెలియదా? సీఎం కూడా దీని గురించి గతంలో హామీలు ఇచ్చారు"