తెలంగాణ

telangana

ETV Bharat / bharat

9వ తరగతి విద్యార్థి ఐడియాతో రోడ్డు ప్రమాదాలకు చెక్​! - లైఫ్​ లైన్​

నిద్రమత్తు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి సరికొత్త పరికరాన్ని రూపొందించాడు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నప్పుడు.. అతన్ని అలర్ట్‌ చేసే విధంగా 'లైఫ్‌లైన్‌' అనే కళ్లజోడును తయారుచేశాడు. ఈ పరికరం పెద్ద శబ్దం చేస్తూ.. అతని కళ్లకు వైబ్రేషన్ ఇచ్చి మేల్కొలుపుతుందని తొమ్మిదో తరగతి చదువుతున్న షన్మయ్‌ తెలిపాడు. భవిష్యత్తులో కళ్లజోడు లేకుండా చిన్న సైజులో లైఫ్‌లైన్‌ను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

road accidents
ఈ 'లైఫ్​లైన్​'తో రోడ్డు ప్రమాదాలకు చెక్​

By

Published : Nov 2, 2021, 7:17 AM IST

9వ తరగతి విద్యార్థి ఐడియాతో రోడ్డు ప్రమాదాలకు చెక్​!

దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట నిత్య రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉంటాం. ప్రమాదాల కారణంగా ఏటా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది గాయాలపాలవుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది మాత్రం డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండి వాహనాన్ని అదుపుచేయలేక జరిగే ప్రమాదాల సంఖ్యే. అలా ని‌ద్ర మత్తు నుంచి మేల్కొలుపేందుకు కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి సరికొత్త పరికరాన్ని రూపొందించాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని శిశిల గ్రామానికి చెందిన చిన్మయ్‌ గౌడ.. స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. జాతీయ రహదారికి సమీపంలోనే అతను చదువుతున్న పాఠశాల ఉండగా.. ఆ రహదారిపై తరుచూ ప్రమాదాలు జరగుతుండడం చిన్మయ్‌ గమనించాడు. డ్రైవర్ నిద్రమత్తే అధిక ప్రమాదాలకు కారణమని ఉపాధ్యాయుల నుంచి తెలుసుకున్న చిన్మయ్‌.. దాని కోసం పరిష్కారం వెతకాలనుకున్నాడు.

లైఫ్​లైన్​తో చిన్మయ్​ గౌడ్​

డ్రైవర్‌ను మేల్కొలిపేలా పరికరం తయారీకి సంబంధించిన సమాచారాన్ని చిన్మయ్‌ ఆన్‌లైన్‌లో సేకరించాడు. వెంటనే దానికి అవసరమైన ఓ కూలింగ్‌ గ్లాస్‌, నానో చిప్‌, మినీ సౌండ్‌ బజర్‌, వైబ్రేటర్‌, చిన్నపాటి బ్యాటరీని ఆర్డర్‌ చేశాడు. వీటిని ఉపయోగించి.. లైఫ్‌లైన్‌ అనే కళ్లజోడు రూపొందించాడు. ఈ కళ్లజోడును వాహనాన్ని నడుపుతున్న సమయంలో డ్రైవర్‌ పెట్టుకుంటే అతడ్ని అలర్ట్‌ చేస్తుందని చిన్మయ్‌ తెలిపాడు. డ్రైవర్‌ రెండు సెకన్లకు మించి కళ్లు మూసుకుని ఉంటే.. వెంటనే పరికరం నుంచి పెద్ద శబ్దం వస్తుందని చెప్పాడు. డ్రైవర్‌ కళ్లకు సైతం చిన్నపాటి వైబ్రేషన్‌ ఇస్తుందని.. దీంతో వెంటనే వారు అలర్ట్‌ అవడానికి వీలు ఉంటుందని వివరించాడు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను అరికట్టే అవకాశం అధికంగా ఉందని చిన్మయ్‌ చెప్పాడు.

లైఫ్​లైన్​ పరికరం

కళ్లజోడు వల్ల రాత్రి సమయాల్లో... డ్రైవర్‌కు లైట్‌ ఫోకస్‌ అధికంగా పడే అవకాశం ఉందని చిన్మయ్‌ గౌడ అంటున్నాడు. దానికోసం కళ్లజోడు లేని విధంగా చిన్నసైజులో ఈ లైఫ్‌లైన్‌ పరికరం తయారు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

ఇదీ చూడండి:-మనిషితనానికి చదువుల ఒరవడి

ABOUT THE AUTHOR

...view details