తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చర్చిపై దాడి..​ విగ్రహం ధ్వంసం.. హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు

Karnataka Church Attack : కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కర్ణాటక మైసూరులోని సెయింట్ మేరీస్​ చర్చిపై దాడి చేశారు. బేబీ జీసస్​ విగ్రహంతో పాటు చర్చిలోని ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు.

Karnataka Church Attack
Karnataka Church Attack

By

Published : Dec 28, 2022, 2:25 PM IST

Karnataka Church Attack : కర్ణాటక మైసూరులోని సెయింట్ మేరీస్​ చర్చిపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం దాడి చేశారు. బేబీ జీసస్​ విగ్రహంతో పాటు చర్చిలోని ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. చర్చిలోని మరికొన్ని వస్తువులను దొంగిలించిన నిందితులు.. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. చర్చి పాస్టర్​ ఫాదర్​ జాన్​ పాల్​ ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చర్చి ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

క్రిస్మస్​ జరిగిన రెండు రోజుల్లోనే ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. క్రిస్మస్​ విహార యాత్రకు వెళ్లిన చర్చి ఉద్యోగి మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో వచ్చి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాస్టర్​కు సమాచారం అందించాడు. నిందితులు చర్చి వెనుక డోర్​ నుంచి వచ్చి ఈ విధ్వంసం సృష్టించారని పోలీసులు భావిస్తున్నారు. చర్చిలోని హుండీని సైతం దుండగులు ఎత్తుకెళ్లారు.

సెయింట్​ మేరీస్ చర్చి
దుండగులు ధ్వంసం చేసిన చర్చి సామగ్రి

కొంతకాలంగా బలవంతపు మతమార్పిళ్ల ఆరోపణల నేపథ్యంలో ఉత్తరాఖండ్​, ఉత్తర్​ ప్రదేశ్​, కేరళ రాష్ట్రాల్లోని క్రిస్టియన్​ మిషనరీలు, చర్చిలపై దాడులు జరుగుతున్నాయి. బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై గతేడాదే ప్రకటించారు.

ఇవీ చదవండి :మోదీ తల్లికి అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

'దేశ ప్రజలను విద్వేషాలతో విడగొడుతున్నారు'.. కాంగ్రెస్​ ఆవిర్భావ వేడుకల్లో ఖర్గే

ABOUT THE AUTHOR

...view details