మద్యం మత్తులో పేగుబంధాన్ని మరిచి ప్రవర్తించాడు ఓ వ్యక్తి. డబ్బుల కోసం గొడవపడి కన్నతల్లినే కడతేర్చాడు. ఈ అమానవీయ ఘటన కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో జరిగింది.
ఇనుప రాడ్డుతో..
మోలకల్మూరులో నివసించే రత్నమ్మ(45) కుమారుడు లోకేశ(22).. ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం.. డబ్బులు కావాలని తన తల్లిని వేధించాడు. వాగ్వాదానికీ దిగాడు. అయితే డబ్బులిచ్చేందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన లోకేశ.. తన తల్లిని ఇనుపరాడ్డుతో గట్టిగా మోదాడు. తీవ్రంగా గాయపడ్డ రత్నమ్మ అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు.