కర్ణాటక చిత్రదుర్గలో దారుణం జరిగింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటకు వెళ్లిన ఓ బాలికపై.. హత్యాచారం జరిగింది.
ఏం జరిగింది?
చిత్రదుర్గ జిల్లాలోని ఓ గ్రామంలో నివసించే బాలిక కుటుంబం.. తమ ఇంటి నిర్మాణం జరుగుతున్నందున ఓ కమ్యూనిటీ భవనంలో నివసిస్తోంది. దాంతో ఆరుబయటే మరుగుదొడ్డి అవసరాలను తీర్చుకుంటోంది. ఈ క్రమంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన బాలిక.. ఎంతకూ తిరిగి రాలేదు. దాంతో తల్లిదండ్రులు వెతకగా.. వారికి ఓ మొక్కజొన్న తోటలో బాలిక మృతదేహం నగ్నంగా కనిపించిందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై గాట్లు ఉన్నాయని చెప్పారు. సమీపంలో ఉన్న ఓ నీటిగుంటలో బాలిక చెప్పులు కనిపించాయని వెల్లడించారు.