కన్నడ రాజకీయాల్లో దుమారం రేపిన మాజీ మంత్రి రమేశ్ జర్ఖిహోళి సీడీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో జర్ఖిహోళితో పాటు ఓ మహిళను ప్రశ్నించిన సిట్ అధికారులు.. మరో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత సుధాకర్‌కు నోటీసులు పంపారు. సోమవారం.. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పుకొచ్చారు సుధాకర్.
"సీడీ కేసులో మహిళకు నేను డబ్బు బదిలీ చేయలేదు. ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సిట్ అధికారుల విచారణలో ఇదే సమాధానం చెబుతాను. ఈ కేసులో మాజీ మంత్రి ఉన్నారని వదంతులు వచ్చాయి. అవసరమైతే కోర్టుకు వెళ్తాను. సీడీ కేసులో నా పేరు ఉందని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను."
- సుధాకర్, మాజీ మంత్రి
అయితే మాజీ సీఎం సిద్ధరామయ్య, రమేశ్ జర్ఖిహోళి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సహా అందరూ తనకు సన్నిహితులే అని చెప్పుకొచ్చారు సుధాకర్.