ఓ వైపు సీరియస్‌గా మ్యాచ్ జరుగుతోంది. ఇక తాడో పేడో తేల్చుకుందామని బరిలోకి దిగిన ఓ కుర్రాడు 50 ఓవర్ల మ్యాచ్‌లో ఏకంగా 48 ఫోర్లు, 28 సిక్స్‌లు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 16 ఏళ్ల వయసులో ఈ ఘనతను సాధించిన ఆ అబ్బాయి గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. కర్ణాటక శివమొగ్గలోని పీసెట్ కళాశాల మైదానంలో కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ ఆధ్యర్యంలో జరిగిన అండర్-16 గ్రూప్ క్రికెట్ టోర్నమెంట్లో సాగర్ క్రికెట్ క్లబ్ అనే జట్టుకు, ఏటీసీసీ భద్రావతి అనే మరో జట్టుకు మధ్య మ్యాచ్ జరిగింది. సాగర్ టీమ్ నుంచి బరిలోకి దిగి విజృంభించిన తన్మయ్ మంజునాథ్ ఏకంగా 407 రన్స్ స్కోర్ చేశాడు.
తన్మయ్ మంజునాథ్ చేసిన స్కోర్‌తో ఆ జట్టు 583 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. సుమారు 165 బంతుల్లో 48 ఫోర్లు, 24 సిక్సర్లతో ఈ స్కోర్‌ను సాధించిన తన్మయ్‌కు 120 పరుగులు చేసిన మరో క్రీడాకారుడు అన్షు తోడయ్యాడు. దీంతో వీరిద్దరూ పార్ట్నర్షిప్లో 350 పరుగులు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భద్రావతి జట్టు 73 పరుగులకే ఆలౌట్ అయింది.