Basanagouda Patil: రెండున్నరవేల కోట్ల రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రిని చేస్తామంటూ కొంతమంది తనను సంప్రదించారని కర్ణాటక భాజపా ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మధ్యవర్తులు ఈ మొత్తం డిమాండ్ చేశారని తెలిపారు. శుక్రవారం జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించిన బసనగౌడ వారు ఎవరనేది మాత్రం బహిర్గతం చేయలేదు. పార్టీ టికెట్ ఇప్పిస్తాం.. సోనియా గాంధీ, జేపీ నడ్డాతో సమావేశం ఏర్పాటు చేస్తామంటూ కొందరు వస్తుంటారన్న బసనగౌడ్.. అలాంటి వారు తనవద్దకు ఓ సారి వచ్చినట్లు తెలిపారు. రెండున్నర వేల కోట్లు ఇస్తే సీఎం చేస్తామని ప్రతిపాదించినట్లు వివరించారు.
'రూ.2500 కోట్లు ఇస్తే సీఎం నువ్వే' - భాజపా న్యూస్
Basanagouda Patil Yatnal: కర్ణాటక భాజపా ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండున్నరవేల కోట్ల రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రిని చేస్తామంటూ కొంతమంది తనను సంప్రదించినట్లు బహిర్గతం చేశారు.
karnakata news
ఈ మేరకు మాట్లాడిన ఆయన టికెట్లు, పదవులు ఆశచూపే కంపెనీలు పెద్ద స్కామ్‌గా అభివర్ణించారు. రాజకీయాల్లో డబ్బులకు పదవులను ఆశచూపే దొంగలను నమ్మకూడదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని బసనగౌడ సూచించారు. బసనగౌడ పాటిల్ వాజ్‌పేయీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరోవైపు బసనగౌడ వ్యాఖ్యలపై దర్యాప్తు చేయించాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:డబ్ల్యూహెచ్ఓ నివేదికపై రాజకీయ దుమారం.. తప్పుపట్టిన 20 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు