తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.56 కోట్ల డ్రగ్స్​ సీజ్​- మహిళ అరెస్ట్​

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ డ్రగ్స్ రాకెట్​ను పోలీసులు ఛేదించారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ తరలిస్తున్న రూ.56 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను సీజ్ చేశారు.

heroin seize
హెరాయిన్

By

Published : Jul 2, 2021, 5:13 PM IST

కర్ణాటక బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో 8 కిలోల హెరాయిన్​ను సీజ్​ చేశారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్​లో రూ.56 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళపై అనుమానంతో తనిఖీ చేయగా.. ఆమె సూట్‌కేస్ అడుగున 8 కిలోల హెరాయిన్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈమె దేశంలో అతిపెద్ద డ్రగ్​ నెట్‌వర్క్ నడుపుతోందని వెల్లడించారు.

సదరు మహిళను అదుపులోకి తీసుకుని.. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:కర్ణాటక మత్తు దందాలో కదులుతున్న డొంక

ఒంటి చేత్తో డ్రగ్స్​​ ముఠా ఖేల్​ ఖతం- హోంగార్డ్​కు ప్రమోషన్

ABOUT THE AUTHOR

...view details