Karnataka Assembly Election 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో జేడీఎస్ నిలుస్తాయని పేర్కొన్నాయి. కాంగ్రెస్‌కు 94 నుంచి 108 మధ్య సీట్లు వస్తాయని 'రిపబ్లిక్ పీ-మార్క్' ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీకి 85 నుంచి వంద స్థానాలు వస్తాయని పేర్కొంది. జేడీఎస్‌కు గరిష్ఠంగా 32 స్థానాలు రావొచ్చని లెక్కగట్టింది.
న్యూస్ నేషన్ సీజీఎస్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం 114 స్థానాలతో భాజపా అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ 86 స్థానాల్లో, జేడీఎస్ 21 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని అంచనా వేసింది. సువర్ణన్యూస్-జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్స్ భాజపాకు 94 నుంచి 117 స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది. కాంగ్రెస్‌కు 91 నుంచి 106 స్థానాలు, జేడీఎస్‌కు 14 నుంచి 24 స్థానాలు రావచ్చని లెక్కగట్టింది.
- 'రిపబ్లిక్ పీ-మార్క్' పోల్ ఇలా..
- బీజేపీ: 85-100
- కాంగ్రెస్: 94-108
- జేడీఎస్: 24-32
- ఇతరులు: 2-6
- జీ న్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్
- బీజేపీ: 79-94
- కాంగ్రెస్: 103-118
- జేడీఎస్: 25-33
- ఇతరులు: 2-5
- న్యూస్‌నేషన్ సీజీఎస్ ఎగ్జిట్ పోల్
- బీజేపీ: 114
- కాంగ్రెస్: 86
- జేడీఎస్: 21
- ఇతరులు: 3
- టీవీ9 ఎగ్జిట్ పోల్
- బీజేపీ: 99-109
- కాంగ్రెస్: 88-98
- జేడీఎస్: 21-26
- ఇతరులు: 0-4