తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఏనుగుకు కన్నడ పవర్ స్టార్ 'పునీత్' పేరు - గున్న ఏనుగుకు పునీత్​రాజ్​కుమార్​ పేరు

కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​కు(punit raj kumar news) నివాళిగా ఓ రెండేళ్ల ఏనుగుకు ఆయన పేరు(baby elephant name) పెట్టారు అటవీశాఖ అధికారులు. అభిమానుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

elephant named as puneeth rajkumar
ఆ ఏనుగుకు కన్నడ పవర్ స్టార్ 'పునీత్' పేరు

By

Published : Nov 13, 2021, 12:37 PM IST

Updated : Nov 13, 2021, 1:57 PM IST

ఆ ఏనుగుకు కన్నడ పవర్ స్టార్ 'పునీత్' పేరు

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సక్రేబైలు ఏనుగుల శిబిరంలోని ఓ రెండేళ్ల గున్న ఏనుగుకు(baby elephant name) 'పునీత్​ రాజ్​కుమార్'​గా(punit raj kumar news) నామకరణం చేశారు అధికారులు. ఇటీవల మృతిచెందిన కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​కు నివాళిగా ఈ ఏనుగుకు ఆయన పేరు పెట్టినట్లు అధికారులు తెలిపారు. అభిమానులు, సిబ్బంది విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

పవర్​స్టార్​ చివరి రోజుల్లో ఈ శిబిరాన్ని సందర్శించారని.. ఇక్కడ ఏనుగులతో రెండు గంటల పాటు గడిపారని అధికారులు పేర్కొన్నారు.

'పునీత్​ రాజ్​కుమార్​'
పునీత్​ రాజ్​కుమార్​ను తరలిస్తున్న సిబ్బంది

తల్లికి దూరంగా..

రెండేళ్ల ఈ 'పునీత్​ రాజ్​కుమార్​'ను(punit raj kumar news) ఇటీవల తల్లి నుంచి వేరుచేశారు అధికారులు. ఆ సమయంలో ఆ పిల్ల ఏనుగు(baby elephant) ప్రతిఘటించింది. కానీ తాళ్లతో బంధించి బలవంతంగా ఆ రెండు ఏనుగులను సిబ్బంది విడదీసి ఆ గున్న ఏనుగును వేరే ప్రాంతానికి తరలించారు. ట్రైనింగ్​లో భాగంగానే ఇలా చేశామని.. మూడు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి ఆ తర్వాత శిక్షణ ప్రారంభిస్తామని సిబ్బంది చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి :పదో తరగతి తెలివితేటలతో 'డ్రగ్స్'​ ల్యాబ్.. చివరకు?

Last Updated : Nov 13, 2021, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details