తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Online class: కూలీ పని చేసి.. చదువు'కొని'! - ఆన్​ లైన్ విద్య

ఆన్​లైన్​ పాఠాలు (Online class) వినేందుకు ఫోన్​ కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారు పలువురు పేద విద్యార్థులు. ఎలాగైనా విద్య కొనసాగించాలనుకున్న కర్ణాటకలోని ఓ విద్యార్థి చిన్నవయసులోనే వ్యవసాయ కూలిగా మారాడు.

Online classes
ఆన్​లైన్ బోధన

By

Published : Aug 30, 2021, 6:25 AM IST

ఫోన్​ కోసం కూలి పనిచేస్తున్న విద్యార్థి వీరేశ్

"మాది పేద కుటుంబం. ఫోన్ కొనిచ్చే స్తోమత అమ్మా, నాన్నలకు లేదు. అందుకే కూలి పనులకు వెళుతున్నా" అని ఓ విద్యార్థి చెప్పిన మాటలు గ్రామీణ పేదరికానికి, ఆన్​లైన్​ బోధన అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.

పొలం పనులు చేస్తున్న వీరేశ్

ఆన్​లైన్​ పాఠాలు (Online class) వినడానికి సిగ్నల్​ కోసం చెట్లెక్కిన ఉదంతాలు, ఫోన్​లు కొనడానికి మామిడి పండ్లువిక్రయించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటనే కర్ణాటకలోని కొప్పళ్​లో జరిగింది.

వీరేశ్, విద్యార్థి

​కుకనూర్​ తాలుకా భానాపుర్​లో వీరేశ్​ అనే విద్యార్థికి ఆన్​లైన్​ పాఠాలు వినేందుకు ఫోన్​ లేదు. తల్లిదండ్రులకు కొనిచ్చే స్తోమత లేదు. దీంతో కొన్నాళ్లుగా వ్యవసాయ పనులకు వెళుతున్నాడు వీరేశ్. అలా రూ.20వేలు సంపాదించాడు. అందులోంచి రూ.10 వేలు పెట్టి ఫోన్​ కొనుక్కున్న అతడు.. మిగిలినవాటిని ఇంటి ఖర్చుల కోసం అమ్మానాన్నలకు ఇచ్చేశాడు.

ఇలాంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం సహకారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:ఆన్​లైన్ క్లాసులు వింటుంటే.. బండరాయి మీద పడి...

ABOUT THE AUTHOR

...view details