తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెన్ను పోయిందని కేసు పెట్టిన ఎంపీ.. పోలీసుల దర్యాప్తు! - కన్యాకుమారి ఎంపీ పెన్ను న్యూస్

Vijay vasanth pen: తమిళనాడు కన్యాకుమారి కాంగ్రెస్​ ఎంపీ విజయ్​ వసంత్​ తన లక్షా యాభై వేల రూపాయల పెన్ను పోయిందని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆ పెన్ను.. మరణించిన తన తండ్రి జ్ఞాపకమని ఆయన తెలిపారు.

vijay vasanth pen
vijay vasanth pen

By

Published : Jul 5, 2022, 10:58 PM IST

Vijay vasanth pen: పెన్ను పోయిందని పోలీస్​ స్టేషన్లో కేసు పెట్టారు తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ. అంత చిన్న పెన్ను కోసం పోలీస్ స్టేషన్​ వరకు ఎందుకు వెళ్లారు అని ఆలోచిస్తున్నారా ఆ పెన్ను విలువ రూ. లక్షా 50 వేలపై మాటేనండీ. పైగా ఆ పెన్ను.. మరణించిన తన తండ్రి జ్ఞాపకమని తెలిపారు.

కాంగ్రెస్​కు చెందిన కన్యాకుమారి ఎంపీ విజయ్​ వసంత్​ తన రూ.లక్షా యాభైవేల పెన్ను పోయిందని పోలీస్ స్టేషన్​లో కేసు పెట్టారు. చెన్నైలో జరిగిన.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్వాగత సమావేశంలో తన పెన్ను దొంగిలించారని ఫిర్యాదు చేశారు. ఈ పెన్నును తన తండ్రి ఇచ్చారని.. అది తనకు ప్రత్యేకమైనదని ఆయన తెలిపారు. అలాంటి పెన్ను పోవడం షాక్​కు గురిచేసిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:స్పైస్​జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! ఒకే రోజులో రెండు..17 రోజుల్లో ఏడు

ABOUT THE AUTHOR

...view details