తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో 'కాంవడ్​ యాత్ర' రద్దు - యూపీలో కాంవడ్​ యాత్ర

ఉత్తర్​ప్రదేశ్​లో 'కాంవడ్​ యాత్ర'ను రద్దు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. యాత్ర అనుమతులపై సోమవారంలోపు వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసుల జారీ చేసిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Kanwar Yatra has been cancelled in Uttar Pradesh
కాంవడ్​ యాత్ర రద్దు

By

Published : Jul 17, 2021, 10:38 PM IST

Updated : Jul 17, 2021, 10:44 PM IST

కరోనా మూడోముప్పు పొంచి ఉందన్న నిపుణుల ఆందోళన నేపథ్యంలో ఈ ఏడాది 'కాంవడ్​ యాత్ర'ను రద్దు చేసింది ఉత్తర్​ప్రదేశ్​. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు యాత్రను విరమించుకున్నట్లు యాత్ర నిర్వాహకులు తెలిపారు.

కాంవడ్​ యాత్రపై పునరాలోచన చేయాలని, యాత్రకు ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారో సోమవారంలోపు వివరణ ఇవ్వాలని యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. అంతకు ముందుగానే ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

జులై 25 నుంచి కాంవడ్‌ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ యాత్రలో భాగంగా ఏటా శ్రావణ మాసంలో పక్షం రోజుల పాటు శివ భక్తులు గంగా నదీ జలాలను సేకరిస్తుంటారు. కఠిన ఆంక్షల మధ్య, పరిమిత సంఖ్యలో కాంవడ్ యాత్ర జరుగుతుందని గత మంగళవారం యూపీ ప్రభుత్వం తెలిపింది. యాత్రికులు తమ వెంట ఆర్టీపీసీఆర్ నెగెటివ్ నివేదికను తప్పనిసరిగా తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై నిపుణులతో పాటు సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. దాంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

ఉత్తరాఖండ్ మాత్రం కాంవడ్ యాత్రను రద్దుచేస్తున్నట్లు ముందుగానే ప్రకటించింది. కోట్లాది మంది పాల్గొనే మతపరమైన కార్యక్రమాలకు అనుమతులిస్తే కరోనా మూడోవేవ్‌కు అవకాశాలు పెరుగుతాయన్న వైద్య నిపుణుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 'ప్రజలు చనిపోవడాన్ని దేవుళ్లు కూడా కోరుకోరు' అంటూ ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వ్యాఖ్యానించారు. తాజాగా ఆ జాబితాలో యూపీ చేరింది.

ఇదీ చూడండి:మూడో ముప్పువేళ.. ఈ 'కాంవడ్' యాత్ర ఏంటి?

Last Updated : Jul 17, 2021, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details