Kanpur News: దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్ ప్రజలు ప్రత్యేక ఉదాహరణగా నిలిచారు. హారతి, అజాన్లు ఒకే ప్రాంగణంలో చేస్తూ హిందూ ముస్లిం సోదరభావానికి ప్రతీకగా నిలుస్తున్నారు. కాన్పూర్ నగర నడిబొడ్డున్న ఉన్న తత్మిల్ చౌక్ వద్ద హనుమాన్ దేవాలయం, మసీదు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఇరు వర్గాల సహాకారంతో ప్రార్థనలు జరుగుతాయని ఆలయ పూజారి తెలిపారు.
"రెండు వర్గాల సహకారంతో హారతి, అజాన్ జరుపుకుంటాము. మేము అందరిని కలుపుకొని పోవడాన్ని నమ్ముతాం. పరమత సహనాన్ని పాటిస్తాం. మేము ఎంతో శాంతిగా ఉంటాం."
- హనుమాన్ ఆలయ పూజారి