తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ వ్యక్తికి మూడు కిడ్నీలు, వైద్యులు షాక్​ - కాన్పూర్​ లేటెస్ట

సాధారణంగా కిడ్నీ ఫెయిల్​ అయిన ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఉత్తర్​ప్రదేశ్​లో ఓ వ్యక్తికి మూడు కిడ్నీలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఎవరికైనా కిడ్నీ అవసరం అయితే తన మూడవ కిడ్నీని దానం చేస్తానని ఈటీవీ భారత్​ ద్వారా తెలిపారు.

kidney
కిడ్నీ

By

Published : Aug 25, 2022, 11:14 AM IST

Kanpur man blessed with three kidneys: కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతాయంటారు. కొన్ని వార్తలు విన్నప్పుడు అది నిజమే అనిపిస్తుంది. ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​​కు చెందిన.. సుశీల్​ గుప్తా అనే 52 ఏళ్ల వ్యాపారికి పుట్టుకతోనే మూడు కిడ్నీలు ఉన్నట్లు 2020లో వైద్యులు గుర్తించారు. అతనికి అల్ట్రాసౌండ్ ద్వారా బ్లాడర్ సర్జరీ(మూత్రపిండాల శస్త్రచికిత్స) చేస్తున్నప్పుడు వైద్యులు దీన్ని గుర్తించారని గుప్తా ఈటీవీ భారత్​కు వెల్లడించారు.

వైద్యులు గుర్తించిన మూడవ కిడ్నీ

ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. దాని వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదని అన్నారు గుప్తా. అది తనకు దేవుడు ఇచ్చిన వరం అని తెలిపారు. తాను మరణించాక.. తన కళ్లను దానం చేస్తానని ప్రకటించారు. ఎవరికైనా కిడ్నీ అవసరం అయితే వారికి తన మూడవ కిడ్నీని దానం చేస్తానని.. ఆ విషయంలో వెనకడుగు వేయనని తెలిపారు.

"కొన్ని నెలలు ముందు వైద్యులు నాకు మూడు కిడ్నీలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం మూడు కిడ్నీలు ఉన్నా.. నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదు.. ఆరోగ్యంగానే ఉన్నాను. అది నాకు దేవుడిచ్చిన వరం. నేను చనిపోయాక నా కళ్లను దానం చేస్తాను. ఎవరికైనా కిడ్నీ అవసరమై నన్ను సంప్రదిస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తాను.''

-సుశీల్​ గుప్తా, వ్యాపారవేత్త

ఇవీ చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details