తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫినాయిల్ తాగి ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం - కర్ణాటక న్యూస్ ఆన్​లైన్

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి చైత్ర కొట్టూరు.. ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రముఖ వ్యాపార వేత్తతో ఈ మధ్యే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించటం చర్చనీయాంశమైంది.

Kannada actress Chaitra Kotturu attempts suicide
ఫినాయిల్ తాగి కన్నడ నటి ఆత్మహత్యాయత్నం

By

Published : Apr 9, 2021, 1:06 PM IST

Updated : Apr 9, 2021, 2:49 PM IST

ప్రముఖ కన్నడ నటి, బిగ్​బాస్ షోలో పాల్గొన్న చైత్ర కొట్టూరు ఆత్మహత్యాయత్నం చేశారు. కోలార్​లోని తన ఇంట్లో ఫినాయిల్ తాగారు. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కన్నడ నటి చైత్ర కొట్టూరు..

ఆమె ఇటీవలే(మార్చి 28న) నాగార్జున అనే వ్యాపారవేత్తను ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అయితే వీరి వివాహ బంధంలో వివాదాలు తలెత్తాయని చర్చనడుస్తోంది. ఆమెను వివాహం చేసుకోవటం నాగార్జునకు ఇష్టం లేదని.. చైత్ర బలవంతం చేసిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఫినాయిల్ తాగి ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం

బిగ్ బాస్ కన్నడ సీజన్-7లో పాల్గొన్న చైత్ర కొట్టూరు.. సుజీదార అనే సినిమాలో సహాయక పాత్రలో నటించి మెప్పించారు.

ఇవీ చదవండి:పాఠశాలలో అగ్ని ప్రమాదం- మంటల్లో చిన్నారులు

చెప్పులు, చీపుర్ల దండలతో భాజపా అభ్యర్థికి అవమానం!

Last Updated : Apr 9, 2021, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details