తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్య, బావతో కలిసి తల్లి దారుణ హత్య.. టార్చ్​లైట్​తో దాడి చేసి.. చీరతో ఉరేసి.. - తల్లిని చంపిన కొడుకు ఛత్తీస్​గఢ్​లో

Son Kills Mother : కన్నతల్లినే కడతేర్చాడు ఓ కుమారుడు. భార్య, బావతో కలిసి దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. ఛత్తీస్​గఢ్​లో జరిగిందీ ఘటన

Son Kills Mother
Son Kills Mother

By

Published : Jul 17, 2023, 12:09 PM IST

Son Kills Mother : ఛత్తీస్​గఢ్​లోని కాంకెర్ జిల్లాలో కుమారుడే కన్నతల్లిని కడతేర్చాడు. బాధితురాలిపై కుమారుడితో పాటు ఆమె కోడలు, అల్లుడు కలిసి తీవ్రంగా దాడి చేసి.. చీరతో ఉరేసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేఖా మజుందార్​ అనే మహిళ.. పంఖజూర్​ పోలీస్​స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. కొద్ది రోజులుగా ఆమె కోడలు పాపియా మజుందార్​తో ఆమెకు చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. దీంతో కోడలు పాపియా, కుమారుడు విప్లవ్​ ముజందార్​.. రేఖపై కోపం పెంచుకున్నారు. మరోవైపు, బాధితురాలి కుమార్తెకు కూడా పెళ్లైంది. ఆమె తన తల్లి రేఖకు డబ్బులు ఇస్తుందనే కారణంతో.. తన భర్త అనూప్​ దాస్​ అలియాస్​ బాపీ కూడా బాధితురాలిపై కోపం పెంచుకున్నాడు.

వీరు ముగ్గురూ కలిసి రేఖను హత్య చేయాలని ప్రణాళిక రచించుకున్నారు. జులై 14 రాత్రి రేఖ వరండాలో నిద్రిస్తున్న సమయంలో.. ఆమె తలపై టార్చ్​లైట్​తో పలుమార్లు దాడి చేశారు. నిద్రలో అకస్మాత్తుగా జరిగిన దాడికి బాధితురాలు స్పృహ కోల్పోయింది. అనంతరం రేఖకు చీరతో ఉరేసి హత్యచేశారు నిందితులు. హత్యను దాచడానికి దాడి చేసిన టార్చ్​, చెప్పులను పారేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ అల్లుడు అనూప్​ దాస్​ను విచారించగా నేరం అంగీకరించాడని.. నిందితులను అరెస్టు చేసి జుడీషియల్​ రిమాండ్​పై జైలుకు పంపించామని కాంకేర్ డీఎస్​పీ అనురాగ్ ఝా తెలిపారు.

కన్న తల్లిని సూదితో పొడిచి హత్య!
Son Killed Mother : ఇలాంటి ఘటన ఇటీవలే మరొకటి జరిగింది. కన్నతల్లిని సూదితో పలుమార్లు పొడిచాడు ఓ కుమారుడు. అనంతరం నిందితుడే స్వయంగా పోలీసులకు ఫోన్​ చేసి.. ఘటనపై సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సత్వంత్ కౌర్ చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధరించారు. మృతురాలు ఓ రిటైర్డ్​ టీచర్​ అని.. భర్త చనిపోగా కుమారుడితో కలిసి ఉంటోందని పోలీసులు తెలిపారు. దిల్లీలోని రోహిణి జిల్లాలో ఈ ఘటన జరిగింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details