తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీజేపీ తరఫున లోక్​సభ బరిలో కంగనా రనౌత్? ఆప్ నుంచి పరిణీతి పోటీ! క్లారిటీ ఇచ్చిన ఫైర్​బ్రాండ్​! - లోక్​సభ ఎన్నికలు పరిణీతి చోప్రా

Kangana Ranaut 2024 Lok Sabha Elections : 2024 లోక్​సభ ఎన్నికల్లో బాలీవుడ్​ ఫైర్​బ్రాండ్​ కంగనా రనౌత్​ పోటీ చేస్తున్నారన్న వార్తలు ఊపందుకున్న వేళ ఆమె స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చారు. మరోవైపు, పరిణీతి చోప్రా.. ఆప్​లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Kangana Ranaut 2024 Lok Sabha Elections
Kangana Ranaut 2024 Lok Sabha Elections

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 7:40 PM IST

Updated : Dec 1, 2023, 7:47 PM IST

Kangana Ranaut 2024 Lok Sabha Elections :2024 లోక్​సభ ఎన్నికల్లో చండీగఢ్​ స్థానం నుంచి బాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ కంగనా రనౌత్​ పోటీ చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. బీజేపీ తరఫున ఆమె రంగంలోకి దిగనున్నట్లు పలు వార్తాసంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే అవన్నీ నిజం కాదని కంగనా క్లారిటీ ఇచ్చారు.

చండీగఢ్​ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిరణ్​ ఖేర్​ రెండు సార్లు ఎంపీగా గెలిచారు. అయితే కిరణ్​ ఖేర్​ ఎప్పుడూ ప్రజల మధ్య ఉండడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలు వినడం లేదని చెబుతున్నారు. దీంతో 2024 ఎన్నికల్లో కిరణ్ ఖేర్​ను అభ్యర్థిగా నిలబెట్టకూడదన్న భావనలో బీజేపీ ఉందట.

ఆ స్థానంలో హిమాచల్ ప్రదేశ్​ వాసి, బాలీవుడ్​ క్వీన్​ కంగనాను బరిలోకి దింపేందుకు బీజేపీ ప్లాన్​ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయమై కంగనా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా స్పందించారు. ఓ వార్తా సంస్థ రాసిన ఆర్టికల్ స్క్రీన్ షాట్​ను ఇన్‌స్టాగ్రామ్​ స్టోరీలో పోస్ట్ చేశారు. "నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీని గురించి నా స్నేహితులు, బంధువులు నన్ను అడుగుతున్నారు. అయితే ఇదంతా నిజం కాదు" అని కంగనా తెలిపారు.

కంగనా ఇన్​స్టా స్టోరీ

ఇటీవలే కంగనా రనౌత్ ద్వారకాలోని శ్రీకృష్ణ ద్వారకాధీశుడి ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో వచ్చే లోక్‌సభలో మీరు పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించింది. అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు తనను ఆశీర్వదిస్తే వచ్చే లోక్‌సభలో పోటీ చేస్తానని కంగనా బదులిచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయ అరంగేట్రంపై వార్తలు ఊపందుకున్నాయి.

ఆప్​ తరఫున పరిణీతి!
మరోవైపు, చండీగఢ్​ లోక్​సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆమ్​ఆద్మీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఆ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్​ చద్ధా భార్య పరిణీతి చోప్రాను బరిలోకి దింపేందుకు ఆప్​ ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం. అయితే చండీగఢ్​ లోక్​సభ స్థానంలో ఇద్దరు బాలీవుడ్​ హీరోయిన్​లు పోటీ పడనున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కంగనా ద ఫైర్​ బ్రాండ్​ - వరుస ఫ్లాపులున్నా కొత్త సినిమాలతో సందడి

ఇందిరా గాంధీతో కంగనా భేటీ - ఎలా సాధ్యమంటే ?

Last Updated : Dec 1, 2023, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details