నటి, శివసేన పార్టీ నేత ఊర్మిళా మాతోంద్కర్ ఓ భవనాన్ని(కార్యాలయం) కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఊర్మిళపై విమర్శలు గుప్పించింది నటి కంగనా రనౌత్. శివసేనలో చేరిన కొన్నివారాలకే రూ.3 కోట్లు విలువ చేసే భవనాన్ని ఎలా కొన్నారన్నట్లు ట్వీట్ చేసింది.
ఈ మేరకు ఓ ట్వీట్‌ను స్క్రీన్ షాట్‌ను తీసీ తన ట్వీట్‌కు జోడించింది కంగన. 'రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన మిత్రపక్షమైన కాంగ్రెస్.. తన ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తోందని, తన మాజీ రాజకీయ పార్టీతో మంచి సంబంధాలు కొనసాగించడానికి మాతోంద్కర్ తెలివిగా వ్యవహరించారు' అంటూ హిందీలో ట్వీట్ చేసింది కంగన.