తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కామారెడ్డిపైనే స్పెషల్ ఫోకస్ - హేమాహేమాలుగా పార్టీ అధినేతలు - పోరులో నెగ్గేదెవరు?

Kamareddy Politics Telangana Assembly Election 2023 : రెండు ప్రధాన పార్టీల అధ్యక్షులు పోటీ చేస్తున్న కామారెడ్డిపై రాష్ట్రం దృష్టి నెలకొంది. సీఎం కేసీఆర్‌, రేవంత్​లు బరిలో ఉండటం, పోలింగ్‌ తేదీ దగ్గర పడటంతో ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. కీలక నాయకులు ఈ నియోజకవర్గంలో ప్రచారం ఉండేలా చూసుకుంటున్నారు. చేరికలతో ప్రత్యర్థులను దెబ్బ తీసే వ్యూహంతో పార్టీలు ఉన్నాయి. విజయమే లక్ష్యంగా ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ప్రచారంతో పాటు వలసలనూ ప్రోత్సహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్​లు పరస్పరం నాయకులకు తమ కండువా కప్పుతున్నాయి.

BJP Tough Competition in Kamareddy
కామారెడ్డిపైనే స్పెషల్ ఫోకస్ - హేమాహేమాలుగా పార్టీ అధినేతలు - పోరులో నెగ్గేదెవరు?

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 6:25 AM IST

కామారెడ్డిపైనే స్పెషల్ ఫోకస్ - హేమాహేమాలుగా పార్టీ అధినేతలు - పోరులో నెగ్గేదెవరు?

Kamareddy Politics Telangana Assembly Election 2023 : కామారెడ్డిలో ప్రధాన పార్టీలు గిరిగీసి బరిలోకి దిగాయి. సై అంటే సై అంటున్నాయి. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఓ వైపు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మరో వైపు నిలబడగా.. వీరి పోటీపై రాష్ట్రమంతా ఆసక్తి నెలకొంది. ఎక్కడ చూసినా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారన్న చర్చే ప్రధానంగా అంశంగా మారిపోయింది. దీనికి తోడు బీజేపీ సైతం గట్టిగా ప్రయత్నం చేస్తోంది.

BRS Election Plan in Kamareddy 2023 : కామారెడ్డిలో బీఆర్ఎస్ ప్రచార జోరు.. 100 మంది ఓటర్లకో ఇంఛార్జ్​తో పక్కా ప్లాన్​​

దీంతో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో(Assembly Constituency) రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రచారం, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, వలసలూ, కీలక నేతల ప్రచారాలు, రోడ్‌ షోలు.. ఇలా నిత్యం నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారిపోయింది.

బీఆర్ఎస్ ప్రచార జోరు.. చేరికల హోరు..: అన్ని తానై న కామారెడ్డి ఎన్నికల ఇంఛార్జిగా వ్యవరిస్తున్న మంత్రి కేటీఆర్.. తరచుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ముఖ్య నేతలతో నిత్యం ఫోన్​లో మాట్లాడుతూ పరిస్థితి తెలుసుకుంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు. తటస్తులు, వ్యాపారవేత్తలు, మేధావులతో మాట్లాడుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికేసుడిగాలిలా పర్యటిస్తున్న కేటీఆర్‌.. గడువు ముగిసే వరకు మరిన్ని రోడ్‌ షోల్లో పాల్గొనేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.

CM KCR Vs Revanth Reddy :కేసీఆర్‌ పోటీలో ఉండటంతో భారీ మెజార్టీయే(Major Majority) లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రచార జోరు చూపిస్తూనే.. చేరికలను ప్రధానంగా చేపట్టారు. షబ్బీర్‌ అలీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ప్రధాన అనుచరులు, నాయకులను బీఆర్ఎస్​లో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే షబ్బీర్ అలీ ప్రధాన అనుచరులు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరింత మందిని చేర్చుకుని కాంగ్రెస్​ను మానసికంగా దెబ్బతీసి ఆ ఫలితం పొందాలని చూస్తోంది.

CM KCR Vs Revanth Reddy in Kamareddy : నువ్వా నేనా.. కామారెడ్డిలో కేసీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌ రెడ్డి?

చేరికల్లో తగ్గేదేలే అంటోన్న హస్తం పార్టీ..: కాంగ్రెస్‌ సైతం బీఆర్ఎస్​కు అదే స్థాయిలో దీటుగా స్పందిస్తోంది. రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్​లు వరుసగా ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో పాటు షబ్బీర్‌ అలీ సైతం తరుచూ నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కీలక నాయకులను కాంగ్రెస్​లో చేర్చుకుంటూ ముందుకు వెళ్తోంది హస్తం పార్టీ. ఇప్పటికే బీఆర్ఎస్​లో వేటు పడిన నాయకురాలు పార్టీలో చేరగా.. ఇటీవల పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్​లో చేరారు.

'కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు ఉన్నంత వరకు యువతకు ఉద్యోగాలు రావు'

తద్వారా తాము సైతం తగ్గేది లేదంటూ కాంగ్రెస్‌(Congress Party) చెప్పకనే చెబుతోంది. మండలాల వారీగా బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు. మాచారెడ్డి మండలంలో బలమైన నేతను గులాబీ పార్టీలో చేర్చుకోగా.. బిక్కనూర్‌ నుంచి సైతం పలువురు కాంగ్రెస్​లో చేరారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. నేరుగా సీఎం బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ అంతే స్థాయిలో చేరికలను ప్రోత్సహిస్తోంది.

BJP Tough Competition in Kamareddy :బీఆర్ఎస్, కాంగ్రెస్‌ స్థాయిలోనే బీజేపీ సైతం కామారెడ్డి నియోజకవర్గంలో బలంగా ఉంది. బలమైన క్యాడర్‌ ఆ పార్టీకి ఉన్నారు. దీంతో కామారెడ్డిలో పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌, గులాబీ పార్టీ పరస్పరం చేరికలను ప్రోత్సహిస్తుండగా.. ఈ రెండు పార్టీల నుంచి బీజేపీలోకి పలువురిని చేర్చుకుంటూ తామూ తక్కువేం కాదని చాటుతున్నారు. సీఎం పోటీ చేస్తున్నప్పటికీ క్యాడర్‌ అంతా బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డితో పాటే ఉన్నారు.

కమలం నుంచి పెద్దగా నాయకులెవరూ కాంగ్రెస్‌, బీఆర్ఎస్(BRS Party) వైపు వెళ్లలేదు. అయితే మొదట్నుంచీ తనదైన వర్గంతో ఉన్న వేణుగోపాల్‌గౌడ్‌ మాత్రం కారు పార్టీలో చేరి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా కామారెడ్డిలో అన్ని పార్టీలు ప్రచార జోరు చూపిస్తూనే.. చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కీలక నాయకులు, గ్రామాలను ప్రభావితం చేసే నాయకుల మీద దృష్టి పెట్టారు. సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు పోటీ చేస్తుండటంతో.. పోటీ తీవ్రంగా ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు.

'సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం'

'కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలను - హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల మాదిరిగా జంట నగరాలుగా తీర్చిదిద్దుతాం'

ABOUT THE AUTHOR

...view details