కాంగ్రెస్‌లో త్వరలోనే పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కమల్‌నాథ్‌ను నియమించనున్నట్లు సమాచారం. గురువారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో... కమల్ భేటీ అయిన నేపథ్యంలో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.
నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ త్వరలోనే ప్రారంభించనుందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. పార్లమెంటు వర్షకాల సమావేశాల అనంతరం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా జరగనుందని తెలిపాయి. అనంతరం.. ఆగస్టులో ఏఐసీసీ ప్లీనరీ సమావేశం కూడా జరగనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమల్‌నాథ్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు దక్కనున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.