తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల కోసం రజనీ మద్దతు కోరనున్న కమల్

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు ప్రముఖ సినీ నటుడు, మక్కల్​ నీది మయ్యమ్​(ఎంఎన్​ఎం) పార్టీ అధినేత కమల్​ హాసన్​. రైతుల డిమాండ్లను కేంద్రం నెరవేర్చాలన్నారు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ మద్దతు కోరనున్నట్టు వెల్లడించారు.

Kamal Hassan appoints former IAS as new general secretary to his party and seeks support from Rajini
'రైతుల డిమాండ్లను కేంద్రం నెరవేర్చాలి'

By

Published : Dec 1, 2020, 4:30 PM IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు మక్కల్​ నీది మయ్యమ్​(ఎంఎన్​ఎం) పార్టీ అధినేత కమల్​ హాసన్​. రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తీర్చాలన్నారు. తమిళనాడులో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ మద్దతు కోరనున్నట్టు వెల్లడించారు. 'నివర్' తుపాను బాధితులను ఆదుకోవటంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

పార్టీ నూతన కార్యదర్శిగా మాజీ ఐఏఎస్​ అధికారి సంతోష్​ బాబును మంగళవారం నియమించారు కమల్. 2021ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టో బాధ్యతలను సంతోష్​కు అప్పగించారు.

కమల్ హాసన్ మక్కల్​ నీది మయ్యమ్ పార్టీని 2018లో స్థాపించారు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయనుంది.

ఇదీ చదవండి:2021 ఎన్నికల బరిలో కమల్​ హాసన్​

ABOUT THE AUTHOR

...view details