తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈనెల 13న ప్రచార శంఖం పూరించనున్నారు మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్. ఈ మేరకు పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్ మహేంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు.
డిసెంబర్ 13 నుంచి 16 వరకు కమల్ తొలి దశ ప్రచారం చేయనున్నారని వెల్లడించారు మహేంద్రన్. అందులో భాగంగా.. మధురై, తేని, దిండిగల్, విరుధునగర్, తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో పర్యటించనున్నట్టు చెప్పారు.
2018 ఫిబ్రవరిలో ఎంఎన్ఎంను ప్రారంభించారు కమల్. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్ సీటును కూడా గెలవలేకపోయింది.