సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను చెన్నైలోని తన నివాసం వద్ద నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్‌హాసన్ కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ అరగంటకు పైగా చర్చించుకున్నారు.
ఎన్నికలకు ముందు రజనీని కలిసిన కమల్‌హాసన్ - చెన్నై నివాసంలో రజినీని కలిసిన కమల్‌హాసన్
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్‌హాసన్ శనివారం.. రజనీకాంత్‌ను కలిశారు. చెన్నైలోని రజనీ నివాసంలో ఆయనను కలిసినట్లు పేర్కొన్నారు.
రజినీని కలిసిన కమల్‌హాసన్
అయితే.. ఇది మర్యాదపూర్వక సమావేశమని, రాజకీయ పరమైనది కాదని కమల్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమల్, రజనీ సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:అందుకే ఇంధన ధరల్లో పెరుగుదల: గహ్లోత్