మహాత్మా గాంధీ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వీ కల్యాణం (99) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా మృతిచెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కల్యాణం.. 1943 నుంచి 1948 వరకు గాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా సేవలు అందించారు.
మహాత్ముడి వ్యక్తిగత కార్యదర్శి కల్యాణం కన్నుమూత - మహాత్మా గాంధీ మాజీ వ్యక్తిగత కార్యదర్శి
మహాత్మా గాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా సేవలు అందించిన వీ కల్యాణం కన్నుమూశారు. 1943 నుంచి 1948 వరకు గాంధీకి ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.
వీ కల్యాణం వ్యక్తిగత కార్యదర్శి
కల్యాణం ఇదివరకు పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చనిపోయే సమయంలో గాంధీ 'హే రామ్' అని చెప్పలేదన్నారు. అయితే ఆ తర్వాత తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని.. గాంధీ ఆ వ్యాఖ్యలు చేసినట్లు తాను వినలేదని చెప్పానని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :మరాఠా రిజర్వేషన్లపై నేడు సుప్రీం తీర్పు