భార్యాభర్తల మధ్య జరిగిన గొడవకు కన్నపిల్లలు బలయ్యారు. క్షణికావేశంలో కన్నతల్లే ఇద్దరు చిన్నారుల ప్రాణాలు(mother murders son) తీసింది. హత్యానంతరం మృతదేహాలున్న గదిలోనే ఉండిపోయింది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ (uttar pradesh crime) బరేలీలో వెలుగుచూసింది.
ఇదీ జరిగింది..
బరేలీ(bareilly city news) భూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని మట్కాపూర్ గ్రామంలో నివసించే బంటు.. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి బంటు, అతని భార్య జయంతి మధ్య గొడవ(uttar pradesh crime) జరిగింది. దీంతో జయంతి.. పిల్లలు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకుని పడుకుంది. అదే సమయంలో బంటు తన గ్రామంలోనే మరో ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు.