కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఓ వ్యక్తి చేసిన బైక్ దొంగతనం అందరి చేత నవ్వులు పూయిస్తుంది. అఫ్జల్పురలోని ఆగ్రో రోడ్లో ఉండే ఓ బైక్ను దొంగతనం చేశాడో వ్యక్తి. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు బండి దగ్గరకు వెళ్లాడు. చుట్టుపక్కల ఎవరైనా లేస్తారని.. బైక్ను కొంత దూరం నడిపించుకుంటూ వెళ్లాడు. తీరా కొంతదూరం వెళ్లాక.. కొట్టేసిన బండి స్టార్ట్ కాలేదు. అంతే.. అక్కడే వదిలేసి వెళ్లక, దొంగతనం చేసిన ప్రాంతంలోనే భద్రంగా తెచ్చిపెట్టాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. వీడియో చూసిన వారు తెగ నవ్వుకుంటున్నారు.
నవ్వులు పూయిస్తున్న బైక్ దొంగతనం- ఏమైందంటే? - అఫ్జల్పుర లో బైక్ దొంగతనం
ఆయనో దొంగ. మోటార్ బైక్లను మాత్రమే దొంగతనం చేస్తుంటాడు. అలానే మరొకటి చేద్దామని పక్కా స్కెచ్ వేశాడు. అర్ధరాత్రికి ఎంచుకున్న బైక్ దగ్గరకు చేరాడు. బండి స్టార్ట్ చేస్తే అందరూ లేస్తారని గుట్టు చప్పుడు కాకుండా.. అక్కడ నుంచి నెమ్మదిగా తోసుకుంటూ ముందుకు సాగాడు. ఇంతలో ఏమైందోగానీ తిరిగి దొంగతనం చేసిన చోటుకే తెచ్చిపెట్టాడు. ఇలా ఎందుకు చేశాడు? అసలేం జరిగిందంటే..
బైక్ దొంగతనం
కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో చాలా బైక్లు చోరీకి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. వీటిపై పోలీస్ శాఖ దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:వైరల్-పోలీసులపై రాళ్లు రువ్విన గ్రామస్థులు!