భర్త వేధింపులు భరించలేక 12 కిలో మీటర్లు నడుచుకుంటూ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది ఓ 8 నెలల గర్భిణి. ఈ ఘటన కర్ణాటక కమలాపుర్లోని కలబురగిలో జరిగింది.
ఇదీ జరిగింది..
భర్త వేధింపులు భరించలేక 12 కిలో మీటర్లు నడుచుకుంటూ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది ఓ 8 నెలల గర్భిణి. ఈ ఘటన కర్ణాటక కమలాపుర్లోని కలబురగిలో జరిగింది.
ఇదీ జరిగింది..
బందనకేర తండాకు చెందిన చినబాయ్ అనే గర్భిణి.. తీవ్ర వేధింపులకు గురైనట్లు తెలిపింది. కట్నం తీసుకురావాలంటూ తన భర్త, ఆయన సోదరుడు తీవ్రంగా ఒత్తిడి చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసులకు పిర్యాదు చేసేందుకు 12 కిలోమీటర్లు నడుచుకుంటూ ఠాణాకు వచ్చినట్లు తెలిపింది.
తన భర్త సునీల్‌కు ఇదివరకే రెండు వివాహాలు జరిగాయని చినబాయ్ ఆరోపించింది. తాగుడుకు బానిసై.. తనను మానసికంగా, శారీరకంగా వేధించ సాగాడని పేర్కొంది. అయితే.. సునీల్‌కు గతంలోనే రూ. లక్ష అందించినట్లు బాధితురాలి తల్లి చెప్పింది.