తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముక్కంటి ఇంటికి మనదైన దారి.. యాత్రికులకు తగ్గనున్న వ్యయప్రయాసలు

Kailash Yatra 2022: చైనా, నేపాల్‌లలో ప్రవేశించకుండా కైలాస మానసరోవర్‌ యాత్ర చేసేలా కేంద్రం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కైలాస శిఖరం, మానసరోవరాలకు చేరుకోవడంలో వ్యయప్రయాసలను గణనీయంగా తగ్గించే మార్గం 2023 చివరికల్లా సిద్ధం కానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 85% పనులు పూర్తయినట్లు వెల్లడించింది.

Kailash Yatra 2022
మానసరోవర్ యాత్ర

By

Published : Mar 29, 2022, 9:20 AM IST

Kailash Yatra 2022: సాక్షాత్తూ పరమశివుడు నివాసముండే చోటు కైలాస పర్వతం! బ్రహ్మ ముహూర్తంలో దేవతలు స్నానమాచరించే ప్రాంతంగా చెప్పుకొనే మానసరోవరం సరస్సూ అక్కడికి చేరువలోనే ఉంటుంది. టిబెట్‌లోని ఈ రెండు సుమనోహర పుణ్యక్షేత్రాలు హిందువులతో పాటు జైనులు, బౌద్ధులకూ అత్యంత పవిత్రమైనవి. ఏటా ప్రపంచం నలుమూలల నుంచి లక్షలమంది భక్తులు వీటిని సందర్శిస్తుంటారు. భారత్‌ నుంచీ అధిక సంఖ్యలో ప్రజలు కైలాస మానసరోవర యాత్రతో తరిస్తుంటారు. మన దేశం నుంచి ఈ యాత్ర చేపట్టేవారికి కేంద్రప్రభుత్వం తాజాగా తీపికబురు వినిపించింది. కైలాస శిఖరం, మానసరోవరాలకు చేరుకోవడంలో వ్యయప్రయాసలను గణనీయంగా తగ్గించే మార్గం 2023 చివరికల్లా సిద్ధం కానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 85% పనులు పూర్తయినట్లు వెల్లడించింది.

అత్యంత సంక్లిష్టం:కైలాస మానసరోవర ప్రయాణం చాలా క్లిష్టమైనది. వేల అడుగుల ఎత్తులో కొండలెక్కుతూ దిగుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్థమా, మూర్ఛ, గుండెజబ్బులు లేనివారిని మాత్రమే విదేశీ వ్యవహారాలశాఖ ఈ యాత్రకు అనుమతిస్తుంది. అక్కడికి వెళ్లేందుకు ఎంపికైనవారు.. యాత్ర ప్రారంభానికి 3-4 రోజుల ముందే దిల్లీ చేరుకోవాలి. ట్రెక్కింగ్‌ చేసేటప్పుడు వారి శరీర స్పందనలు ఎలా ఉంటాయో పరీక్షిస్తారు. అనంతరం ఉత్తరాఖండ్‌లో గుంజి వద్ద మరోసారి వారికి పరీక్షలు నిర్వహిస్తారు. అంతా బాగుంటే.. అక్కడి నుంచి చైనా సరిహద్దుల్లోని లిపులేఖ్‌ పాస్‌ వరకు పంపిస్తారు. ఇందులో అత్యధిక భాగం ట్రెక్కింగ్‌ చేయాల్సిందే. ప్రతికూల వాతావరణం, కొండచరియలు విరిగిపడటం వంటి పరిణామాలు యాత్రను సంక్లిష్టంగా మారుస్తాయి. లిపులేఖ్‌ వరకు చేరుకోగలిగితే.. అక్కడి నుంచి కైలాస పర్వతం వద్దకు 97 కి.మీ. దూరం వాహనాల్లో ప్రయాణించేందుకు రోడ్డు ఉంటుంది.

చైనా, నేపాల్‌ల నుంచి..:కొండప్రాంతాల్లో నడవలేనివారు భారత్‌ నుంచి మానసరోవర యాత్ర చేపట్టేందుకు ప్రస్తుతం రెండు మార్గాలున్నాయి.
1) దిల్లీ నుంచి పశ్చిమబెంగాల్‌లోని బాగ్దోగ్రా వరకు(1,115 కి.మీ) విమానంలో వెళ్లాలి. అక్కడి నుంచి సిక్కింలోని నాథూలా పాస్‌ గుండా రోడ్డుమార్గంలో 1,665 కిలోమీటర్లు ప్రయాణించి మానసరోవరాన్ని చేరుకోవచ్చు. ఇందులో 1,490 కిలోమీటర్ల దూరం చైనాలో ప్రయాణించాల్సి ఉంటుంది.
2) దిల్లీ నుంచి కాఠ్‌మాండూకు(1,150 కి.మీ) విమానంలో వెళ్లాలి. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 840 కిలోమీటర్లు ప్రయాణించి మానసరోవరాన్ని చేరుకోవచ్చు. లేదంటే రెండు విమానాలు మారి, హెలికాప్టర్‌లో ప్రయాణించే సదుపాయమూ అందుబాటులో ఉంటుంది.

రెండు రోజుల్లో లిపులేఖ్‌కు..:తవాఘాట్‌ నుంచి ఘటియాబ్‌గఢ్‌ వరకు రెండు వరుసల రహదారిని గత ఏడాది మేలో ప్రారంభించారు. ఘటియాబ్‌గఢ్‌ నుంచి లిపులేఖ్‌ పాస్‌ వరకు రోడ్డుమార్గం నిర్మాణ దశలో ఉంది. 2023 చివరికల్లా ఇది పూర్తయ్యే అవకాశముంది. 2005లోనే రూ.80.76 కోట్ల వ్యయంతో ఈ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపారు. 2018లో బడ్జెట్‌ను రూ.439.40 కోట్లకు సవరించారు. గతంలో ఉత్తరాఖండ్‌ గుండా యాత్ర చేపట్టేందుకు ఐదు రోజులపాటు ట్రెక్కింగ్‌ చేయాల్సి వచ్చేది. కొత్త మార్గం అందుబాటులోకి వస్తే ఆ కష్టం తప్పుతుంది. పిథోరగఢ్‌ నుంచి లిపులేఖ్‌ దాకా వాహనాల్లోనే ప్రయాణించొచ్చు. దిల్లీ నుంచి లిపులేఖ్‌కు మొత్తం 750 కిలోమీటర్ల ప్రయాణాన్ని (పిథోరగఢ్‌ గుండా) రెండు రోజుల్లో పూర్తిచేయొచ్చు. కాబట్టి పోనూరానూ ఆరు రోజుల సమయం ఆదా అవుతుంది. ఖర్చూ తగ్గుతుంది.

కొత్త మార్గం ఎలాగంటే..:కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త మార్గం అందుబాటులోకి వస్తే చైనా, నేపాల్‌లలో ప్రవేశించకుండానే భారతీయులు మానసరోవర యాత్ర చేపట్టొచ్చు. ఉత్తరాఖండ్‌లో నిర్మిస్తున్న ఈ నూతన మార్గంలో మూడు భాగాలుంటాయి.

కైలాస యాత్ర

ఇదీ చదవండి:సంపన్న కుటుంబంలో స్వతంత్ర జెండా.. ఉరికంబాన్ని ముద్దాడి..

ABOUT THE AUTHOR

...view details