తెలంగాణ

telangana

ETV Bharat / bharat

MP Avinash bail Petition అవినాష్‌ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు - YSRCP MP Avinash Reddy news

cbi
cbi

By

Published : May 31, 2023, 11:04 AM IST

Updated : May 31, 2023, 11:56 AM IST

10:51 May 31

ప్రతి శనివారం ఉ. 10 నుంచి సా. 5 వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశం

MP Avinash Reddy granted anticipatory bail: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులోఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నేడు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌‌ను మంజూరు చేసింది. తనకు ముందస్తు బెయిల్‌ కావాలంటూ ఇటీవలే అవినాష్‌ రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖాలాలు చేశారు. ఆ పిటిషన్‌పై ఈ నెల 26వ తేదీన (శుక్రవారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ మరుసటి ఈ నెల 27వ తేదీన (శనివారం) మధ్యాహ్నం వరకూ సుదీర్ఘంగా సీబీఐ వాదనలు కొనసాగాయి. అనంతరం వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌.. కోర్టు ముందున్న విస్తృత సమాచారాన్ని క్రోడీకరించి, ఇప్పటికిప్పుడు తుది ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తెలియజేస్తూ.. ఈనెల 31వ తేదీన (నేడు) తీర్పు వెలువరిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో ఈరోజు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని.. సాక్షులను ప్రభావితం చేయొద్దని అవినాష్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అరెస్టు చేసినట్లయితే రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలకు సీబీఐకి ఆదేశించింది.

అనంతరంసీబీఐ దర్యాప్తునకు సహకరించాలని అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ నెలాఖరు వరకు ప్రతి శనివారం సీబీఐ ఎదుట తప్పనిసరిగా హాజరుకావాలని పేర్కొంది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలక వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని తెలియజేస్తూ.. సీబీఐకి అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని అవినాష్‌కు తెలిపింది. న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును సీబీఐ కోరవచ్చని న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ తెలియజేశారు.

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 26, 27 తేదీల్లో తెలంగాణ హైకోర్టులో పిటిషనర్ల తరుపు న్యాయవాదులు, సీబీఐ సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. సీబీఐ, న్యాయవాదుల వాదనలను విన్న ధర్మాసనం.. అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పును ఈ నెల 31వ తేదీన వెలురిస్తామని తెలియజేస్తూ వాయిదా వేసింది. అప్పటి వరకు అవినాష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం..అవినాష్‌ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని.. సాక్షులను ప్రభావితం చేయొద్దని అవినాష్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఇదీ చదవండి:

Last Updated : May 31, 2023, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details