ఉత్తర్‌ప్రదేశ్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ సంజయ్ యాదవ్‌ను సుప్రీం కోర్టు కొలీజియం గురువారం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ.రమణ అధ్యక్షతన సమావేశమైన కొలీజియం ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
అలహాబాద్ సీజేగా జస్టిస్ సంజయ్ యాదవ్! - సుప్రీం కోర్టు కొలీజియం తాజా సిఫారసులు
యూపీ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ యాదవ్ పేరును సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ.రమణ అధ్యక్షతన సమావేశమైన కొలీజియం ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది
సంజయ్ యాదవ్, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
కొలీజియంలో సభ్యులైన జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ యు.యు.లలిత్ ఈ భేటీలో పాల్గొన్నారు. జస్టిస్ సంజయ్ యాదవ్ ప్రస్తుతం.. అలహాబాద్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
ఇదీ చదవండి:'రాజీవ్ హత్య కేసు దోషులను విడుదల చేయండి'