హరియాణా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్ తనను లైంగిక వేధించాడని జూనియర్ మహిళా అద్లెట్ కోచ్ ఆరోపించారు. మంత్రి తనను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించారని ఆమె తెలిపారు. తనకు అనుకూలంగా వ్యవహరిస్తే అన్నీ సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారని ఆమె ఆరోపణలు గుప్పించారు. మంత్రి సందీప్ నాతో సోషల్ మీడియా ద్వారా చాట్ చేశారని.. కానీ చాట్ రికార్డ్ చేయడానికి కుదరని సాఫ్ట్వేర్ను ఉపయోగించారని అథ్లెట్ కోచ్ తెలిపారు.
"మంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తే కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తానని అన్నారు. నేను ఆయనకి లొంగకపోవడం వల్ల వేరే ప్రదేశానికి బదిలీ చేశారు. ఈ ఘటనపై డీజీపీ ఆఫీస్, సీఎం కార్యాలయం, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అందుకే ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలను కలిశా. ఆయన ఇచ్చిన ధైర్యంతో మీడియా ముందుకు వచ్చా. ఇలా చాలా మంది మహిళా క్రీడాకారిణులను మంత్రి లైంగికంగా వేధించారు. వారెవరూ మంత్రికి భయపడి బయటికి చెప్పట్లేదు."
--జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్